ఆదివాసీ ఎంపీటీసీ అభ్యర్థి ఉయిక నాంచారి, జడ్పీటీసీ అభ్యర్థి సవలం అమల ల గెలుపే లక్ష్యం
చింతూరు,( వై7 న్యూస్ తెలుగు) అక్టోబర్ 28:
మండల పరిధిలోని ఏడుగురాళ్లపల్లి పంచాయతీ బొడ్డుగూడెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ అభ్యర్థి ఉయిక నాంచారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని వేగవంతం చేశారు.
ఈ ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతి ఇంటినీ సందర్శిస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, గ్రామ అభివృద్ధి పనులు, ప్రతి పంచాయతీ లో సచివాలయం, ఇంటి ఇంటికి బియ్యం పంపిణీ, ప్రతి ఆరు నెలలకు కొత్త పెన్షన్ మంజూరు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్ద అందిన సేవలు ప్రజలకు వివరిస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సవలం అమల భారీ మెజార్టీతో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం సాగింది. ఎన్నికల్లో ప్రతి ఓటునూ ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ, వారి మద్దతును కూడగట్టడంలో నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిన ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా నాయకులు కోరుతున్నారు. కార్యకర్తల ఉత్సాహం, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఏడుగురాళ్లపల్లి పంచాయతీ లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.








