E-PAPER

ప్ర‌భాస్ ‘స్పిరిట్’ విడుద‌ల వాయిదా..! కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ఖరారు చేయడంతో పాటు ప్రభాస్ కొత్త లుక్‌తో కూడిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీని ప్రకారం ‘స్పిరిట్’ సినిమా 2027, అక్టోబర్ 29న దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ ప్రకటనతో భారత సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఇవాళ ఉద‌యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ వేదికగా సందీప్ వంగా అభిమానులను ఊరించారు. “ప్రభాస్ అన్న అభిమానులకు, సరికొత్త రిలీజ్ డేట్‌తో కూడిన ఒక కొత్త పోస్టర్‌ను పరిచయం చేయబోతున్నాను” అంటూ ట్వీట్ చేసి ఉత్కంఠను పెంచారు. 

ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ప్రభాస్ సీరియస్ లుక్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసి, “2027 అక్టోబర్ 29న దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల” అని అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమాను మొదట 2027 మార్చి 5న విడుదల చేయాలని భావించినా, తాజా మార్పులతో దీపావళి బరిలో నిలిపారు.

ఈ నిర్ణయంతో ‘స్పిరిట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో భారీ చిత్రంతో పోటీ పడటం ఖాయమైపోయింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ పార్ట్ 2’ కూడా 2027 దీపావళికే రానుంది. ‘రామాయణ’ మొదటి భాగం 2026 నవంబర్‌లో విడుదల కానుండగా, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. 

ఇంకా కచ్చితమైన తేదీని వెల్లడించనప్పటికీ, అదే పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకోవడంతో ‘స్పిరిట్’, ‘రామాయణ 2’ మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవైపు ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్, మరోవైపు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేపుతున్న పౌరాణిక గాథ కావడంతో ఈ పోటీ సినీ ప్రియులకు అసలైన పండుగ కానుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!