హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స.. రోజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / Y7 న్యూస్ తెలుగు:
PDSU తెలంగాణ మాజీ రాష్ట్ర నాయకురాలు, ప్రస్తుతం POW భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలిగా పనిచేస్తున్న కామ్రేడ్ జాడి మంజుల తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని మహావీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఉద్యమ మిత్రులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఐసీసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మంజుల.. అనేక విద్యార్థి ఉద్యమాలు, పోరాటాల్లో తనవంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు రోజుకు సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మంజుల వైద్య చికిత్సకు ఆర్థికంగా సహకరించాలని ఉద్యమ మిత్రులు, కుటుంబ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో తమకు తోచినంత సాయం అందించి ఆమె కోలుకోవడానికి తోడ్పడాలని కోరారు.
ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ / Google Pay: 9704732305
జాడి మంజుల త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఉద్యమ మిత్రులు ఆకాంక్షించారు.








