E-PAPER

ఆటో డ్రైవర్ బాలు కుటుంబానికి అండగా ఎస్సై నాగేశ్వరరావు

మానవత్వం చాటుకున్న పోలీసు అధికారి.. ఆటో యూనియన్ నుంచి కూడా ఆర్థిక సాయం

కరకగూడెం, అక్టోబర్ 1 (వై7 న్యూస్ తెలుగు):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మలకుర్తి బాలకృష్ణ (బాలు) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ నేపథ్యంలో బాలు దినవారాల కార్యక్రమాల ఖర్చుల నిమిత్తం పలువురు మానవత్వాన్ని చాటుకున్నారు. కరకగూడెం ఆటో యూనియన్ సభ్యులు బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

అదేవిధంగా కరకగూడెం ఎస్సై నాగేశ్వరరావు తన ఉదారతను చాటుకుంటూ బాలు కుటుంబ సభ్యులకు రూ.5,000 నగదు సహాయాన్ని అందించారు. అనంతరం బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.

తమకు అండగా నిలిచిన ఆటో యూనియన్ సభ్యులు, ఎస్సై నాగేశ్వరరావుకు బాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు కొమరం సాంబశివరావు, గుడ్ల రంజిత్ కుమార్, నిట్టా సౌందర్యరావు, బెజవాడ రాములు, బాదె సాగర్, కొలగాని రవి, యజ్జు సాయి, తోలెం రవి, బంధు సతీష్, నిట్టా సాయి, తోట శివ, నిట్టా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

– దిలీప్ కుమార్, వై7 న్యూస్ తెలుగు, కరకగూడెం మండలం

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!