E-PAPER

రెడ్‌మీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌..! భారీ బ్యాటరీ, 50MP కెమెరా..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రెడ్‌మీ, భారత్‌లో కొత్త 17సీ 5జీ ఫోన్‌ను గురువారం విడుదల చేసింది. రెడ్‌మీ 17 సిరీస్‌లో రెండో ఫోన్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది. భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్‌ కెమెరా దీని ప్రత్యేకతలు. ఈ ఫోన్‌ అక్టోబర్‌ 7 నుంచి అమెజాన్‌, షావోమీ ఆన్‌లైన్‌ స్టోర్‌లో విక్రయానికి అందుబాటులోకి రానుంది.

రెడ్‌మీ 17సీ 5జీ ప్రారంభ ధర రూ.20,999గా కంపెనీ నిర్ణయించింది. 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఈ ధరకు లభించనుంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.22,999. కాఫీ బ్రూ, డార్క్‌ నైట్‌, పర్పుల్‌ డాన్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 810 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత హైపర్‌ఓఎస్‌ 3 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్‌ కెమెరా, ముందు 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ఫోన్‌లో 6,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సీ కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!