E-PAPER

పలాస ఎర్ర చెరువులో పడి వ్యక్తి మృతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత

పలాస, అక్టోబర్ 1 (Y7 News Telugu): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం వీధిలో ఉన్న ఎర్ర చెరువులో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది.

స్థానికుల వివరాల ప్రకారం, పురుషోత్తపురానికి చెందిన అల్లం చిట్టి హేమసుందర్ (40) అనుకోకుండా చెరువులో పడిపోయి నీటిలో మునిగిపోయాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో ప్రమాదవశాత్తు చెరువులో పడి నీటిలో మునిగిపోవడంతోనే మృతి చెందినట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హేమసుందర్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!