E-PAPER

విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకుల దుర్మరణం

బాపట్ల జిల్లా, చీరాల: చీరాల మండలం తోటవారిపాలెంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చీరాలకు చెందిన శ్యామ్, ఇస్సాకు అనే ఇద్దరు యువకులు ఓ ఇంటిలో ఫ్లోరింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుల ఆకస్మిక మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!