E-PAPER

కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

దుమ్ముగూడెం, సెప్టెంబర్ 30 (Y7 న్యూస్): దుమ్ముగూడెం మండల తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఇటీవల వివాహం చేసుకుని కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!