E-PAPER

చెరువును తలపిస్తున్న ఏడుగురాళ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

విద్యా వ్యవస్థపై పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం
వరదలో చిక్కుకున్న.. విద్యా నిలయం

పాలకులారా, అధికారులారా.. ఇకనైనా మీ నిద్ర మత్తు వీడండి.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆపండి


చింతూరు,( వై7 న్యూస్ తెలుగు)సెప్టెంబర్ 25: చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో మోకాళ్ల లోతు నీరు చేరి, కంపుకొడుతున్న పరిసరాలు… ఇది ఏదో అనాథ ప్రాంతంలో ఉన్న పాడుబడిన చెరువు కాదు, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఏడుగురాళ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి. కొద్దిపాటి వర్షానికే ఈ విద్యా దేవాలయం కాస్తా జలశయంగా మారిపోతోంది. బడికి వెళ్తున్నామా లేక ఈతకొలనుకు వెళ్తున్నామా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది.అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ..
ప్రభుత్వాలు ‘బడిబాట’ అంటూ ప్రచార ఆర్భాటాలు చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో ఉన్న ఇలాంటి పాఠశాలల సమస్యలను పట్టించుకోవడం లేదనడానికి ఏడుగురాళ్లపల్లి పాఠశాల ఓ ఉదాహరణ, నీరు నిల్వ ఉండిపోవడం వల్ల దోమలు చేరి, విద్యార్థులు డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ బడులకు దీటుగా మార్చేది ఇలాగేనా?ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తున్నామని, కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు, ఈ బడి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విచారకరం. పాఠశాల ఆవరణ చెరువులా మారినా, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోయినా సంబంధిత విద్యాశాఖ అధికారులు కనీసం ఇటువైపు ముఖం చాటేయడం వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.తల్లిదండ్రుల ఆవేదన.. తక్షణ చర్యలకు డిమాండ్”మా పిల్లలను చదువుకోవడానికి పంపుతున్నామా లేదా రోగాల బారిన పడేయడానికి పంపుతున్నామా అర్థం కావడం లేదు” అని స్థానిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఏడుగురాళ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై స్పందించాలి. తక్షణమే నీటి నిల్వలను తొలగించి, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!