E-PAPER

తుఫాన్ ప్రభావం.. దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు

నందిగామ మండలంలో దెబ్బతిన్న వంశధార గడ్డ బ్రిడ్జి వద్ద అధికారులకు కీలక ఆదేశాలు

శ్రీకాకుళం జిల్లా, పలాస, సెప్టెంబర్ 25 (Y7 News):
తుఫాన్, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న బ్రిడ్జిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించారు. టెక్కలి నియోజకవర్గంలోని నందిగామ మండలం కొత్త అగ్రహారం–జడ్‌యాడ మధ్య వంశధార గడ్డపై ఉన్న బ్రిడ్జి నిన్నటి భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావంతో దెబ్బతినడంతో ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా, దెబ్బతిన్న బ్రిడ్జి స్థానంలో శాశ్వతంగా కొత్త వంతెన నిర్మాణానికి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!