సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు ఫలితాల వెల్లడి
తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన టీజీ టెట్ (TG TET) పరీక్ష ఫలితాలను ఈ నెల 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల విడుదల నేపథ్యంలో అభ్యర్థులు అధికారిక ప్రకటనలను గమనించాలని సూచించారు.
కాగా, ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన టీజీ టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 24 వేల మందికిపైగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
Y7 NEWS TELUGU | ప్రజల గొంతుక
Post Views: 16








