E-PAPER

పలాసలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు దుర్గారావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ


శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు దుర్గారావు ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జనసేన జెండాలు చేతపట్టి “జై జనసేన – జై పవన్ కళ్యాణ్” నినాదాలతో యువత, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది.

అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, నిస్వార్థ సేవాభావం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!