E-PAPER

మొహర్రం ఉత్సవాలకు అండగా కాంగ్రెస్ నాయకులు.. ఉత్సవ కమిటీకి బియ్యం అందజేత

కరకగూడెం, ఆగస్టు 28 (Y7 న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మొహర్రం పండుగ సందర్భంగా నిర్వహించనున్న జారత్ దావత్ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సహకారం అందించారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మొహర్రం ఉత్సవ కమిటీ సభ్యులకు 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. అలాగే కరకగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పోలేబోయిన సుజాత కూడా 25 కిలోల బియ్యాన్ని అందించి ఉత్సవాల నిర్వహణకు తమ వంతు సహకారం ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొహర్రం పండుగ త్యాగం, సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాల పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం భారతీయ సంస్కృతిలో భాగమని, సమాజంలో ఐక్యత, సామరస్య భావాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

సహాయం అందించిన నాయకులకు మొహర్రం ఉత్సవ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!