
పలాస, వై7 న్యూస్: రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మందస మండలంలోని కళింగదళ్ ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కళింగదళ్ ప్రాజెక్టు ద్వారా విడుదలయ్యే నీటితో ఆయకట్టు పరిధిలోని రైతులు ఎంతో ప్రయోజనం పొందనున్నారని పేర్కొన్నారు.
పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని రైతులు మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రాజెక్టు నీటి విడుదలతో ఆయకట్టు ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Post Views: 8








