E-PAPER

జాన్ అబ్రహం డబుల్ రోల్ యాక్షన్ థ్రిల్లర్.. మరో స్టార్ హీరో ఎంట్రీ?

బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో జాన్ అబ్రహం ముందుంటారు. కండలు తిరిగిన శరీరాకృతి, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యాక్షన్ సన్నివేశాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన.. మరోసారి యాక్షన్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో టాప్ హీరో కూడా నటించనున్నాడనే వార్తలు వినిపిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఫోర్స్’, ‘ధూమ్’ వంటి చిత్రాలతో యాక్షన్ హీరోగా ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న జాన్ అబ్రహం.. ఇప్పుడు మరో డబుల్ రోల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ దర్శకుడు శివమ్ నాయర్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. యాక్షన్, స్పై థ్రిల్లర్ చిత్రాలకు పేరుగాంచిన శివమ్ నాయర్.. ‘ఆహిస్తా ఆహిస్తా’, ‘భాగ్ జానీ’ వంటి సినిమాలను తెరకెక్కించారు. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో వచ్చిన ‘నామ్ శబానా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇటీవల జాన్ అబ్రహం హీరోగా యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది డిప్లొమాట్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరోసారి జాన్ అబ్రహం–శివమ్ నాయర్ కాంబినేషన్‌లో సినిమా రానుండటం ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కథకు సంబంధించిన కీలక అంశాలను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే జాన్ అబ్రహంతో పాటు సినిమాలో నటించబోయే మరో హీరో ఎవరనే విషయం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!