E-PAPER

Defense Agreement: సౌదీ, పాక్, టర్కీ కీలక రక్షణ ఒప్పందం.. ‘మక్కా జాయింట్ డిటెర్రెన్స్’తో కొత్త సమీకరణాలు!

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ముస్లిం ప్రపంచంలోని ప్రభావవంతమైన దేశాలైన సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీలు పరస్పర రక్షణ కోసం త్రైపాక్షిక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంటున్నారు. సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కా వేదికగా ఈ ఒప్పందం జరిగినట్లు సమాచారం.

ఈ ఒప్పందాన్ని **‘మక్కా జాయింట్ డిటెర్రెన్స్ అగ్రిమెంట్’**గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, భద్రతాపరమైన సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడం దీని ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.

సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీల మధ్య ఈ తరహా రక్షణ సహకారం పశ్చిమాసియా, దక్షిణాసియా రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక నిబంధనలు, అమలు విధానం, పరస్పర రక్షణకు సంబంధించిన పూర్తి వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!