E-PAPER

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సమ్మక్క–సారలమ్మ పేరు పెట్టాలి

కరకగూడెం, సెప్టెంబర్ 22 (Y7 తెలుగు న్యూస్):
తెలంగాణలో నిర్మితమవుతున్న వరంగల్ విమానాశ్రయానికి ఆదివాసీ వీరనారీమణులు సమ్మక్క–సారలమ్మ పేరును పెట్టాలని తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ డిమాండ్ చేశారు.

సమ్మక్క–సారలమ్మలు ఆదివాసీ సమాజ ఆత్మగౌరవం, ధైర్యం, త్యాగం, హక్కుల పరిరక్షణకు ప్రతీకలుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు.

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సమ్మక్క–సారలమ్మ పేరు పెట్టడం ద్వారా ఆదివాసీ చరిత్ర, సంస్కృతికి గౌరవం దక్కుతుందని వెంకటనారాయణ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని కోరారు.

అలాగే విమానాశ్రయ ప్రాంగణంలో సమ్మక్క–సారలమ్మల చరిత్ర, ఆదివాసీ జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసే సాంస్కృతిక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

రిపోర్టర్: దిలీప్ కుమార్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!