E-PAPER

పి హెచ్ సి లో మరుగుదొడ్ల బ్లాక్, వైద్య పరికరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం

దుమ్ముగూడెం ,జూలై 25 (వై 7 న్యూస్ తెలుగు);

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఐటీసీ మిషన్ సునేహ్రా కల్ (MSK) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్ల బ్లాక్తో పాటు వైద్య పరికరాల ప్రారంభోత్సవం మరియు పీహెచ్‌సీకి అందజేత కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గ శాసన సభ్యులు డా. తెల్లం వెంకట్రావు మరియు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శ్రీ బి. రాహుల్ IAS ముఖ్య అతిథులుగా హాజరై మరుగుదొడ్ల బ్లాక్‌ను ప్రారంభించి, వైద్య పరికరాలను పీహెచ్‌సీకి అందజేశారు.

ఈ కార్యక్రమంలో నరసాపురం సర్పంచ్ కనక రత్నం , డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. శ్రీధర్ , దుమ్ముగూడెం మండల ఎంపీడీవో , పీహెచ్‌సీ వైద్యాధికారి డా. శరత్ , ఐటీసీ మిషన్ సునేహ్రా కల్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ జయప్రకాశ్ , ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీమతి గీత ప్రవల్లిక , హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియ సంస్థ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మరియు ఇతర అధికారులు ఐటీసీ మిషన్ సునేహ్రా కల్ సంస్థ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం మరియు సమగ్ర కమ్యూనిటీ అభివృద్ధి రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఇటువంటి మౌలిక సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!