E-PAPER

‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ క్రేజ్.. అపరా మెహతాకు ఎదురైన భయానక అనుభవం!

సోషల్ మీడియా ప్రభావం లేని రోజుల్లోనే భారతీయ టెలివిజన్ సీరియల్స్ నటీనటులకు అపారమైన అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. ముఖ్యంగా ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుని, అందులో నటించిన కళాకారులను ఇంటింటికీ చేరువ చేసింది. ఆ సీరియల్‌లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి అపరా మెహతా తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఓ షాకింగ్ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

సీరియల్ అత్యున్నత ప్రజాదరణలో ఉన్న సమయంలో అపరా మెహతా నటించిన ఓ గుజరాతీ నాటకాన్ని కోల్‌కతాలోని కళామందిర్ హాలులో ప్రదర్శించారు. వరుసగా ఐదు షోలకు భారీగా ప్రేక్షకులు తరలివచ్చి హాలును పూర్తిగా నింపేశారు. అపరా మెహతా వేదికపైకి రాగానే అభిమానులు ఆమెను దగ్గరగా చూడాలని ఉత్సాహంతో ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.

ఆ ఉత్సాహం క్రమంగా అదుపు తప్పడంతో వేలాది మంది ప్రేక్షకులు దాండియా కర్రలను గాల్లోకి విసిరేయగా, అక్కడ ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 8,000 దాండియా కర్రలు గాల్లో ఎగిరిపడడంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారని అపరా మెహతా వెల్లడించారు. ఆ సంఘటన ఇప్పటికీ తన మదిలో చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయిందని ఆమె తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News