E-PAPER

నేల సారం ఆరోగ్యం పై ఏకలవ్య పాఠశాల లో శిక్షణా కార్యక్రమం

శిక్షణ కార్యక్రమం నిర్వహించిన చింతూరు మండల ఏవో రత్నా ప్రభ

చింతూరు, (వై7 న్యూస్) జూలై 25: పోలవరం జిల్లా, చింతూరు మండలంలోని లక్కవరం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణంలో పాఠశాల విద్యార్థులకు మట్టి నమూనా సేకరణ విశ్లేషణ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతూరు మండల వ్యవసాయ అధికారి రత్నా ప్రభ విద్యార్థులకు మట్టి నమూనా సేకరణ పోషకాల లభ్యత మరియు భూసార పరీక్ష కార్డు అవశ్యకత సూక్ష్మ పోషకాలు లభ్యత వాటి ధాతు లోపాలు వివరించడం జరిగింది.
పొలం లో మట్టి నమూనా ఎలా తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేకంగా విద్యార్థులకు చూపించి వారితో చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ దలీప్ సింగ్ , టీచర్లు దుష్యంత్ కృష్ణకాంత్ , ఫర్జానా , వ్యవసాయ సిబ్బంది దుర్గాప్రసాద్ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News