E-PAPER

ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు.. పోలీసులందరి సెలవులు రద్దు, భద్రత కట్టుదిట్టం

దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో చట్టవ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అన్ని స్థాయిల పోలీసు సిబ్బందికి సాధారణ సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.

అధికారిక ఉత్తర్వుల ప్రకారం క్యాజువల్ లీవ్, ఎర్న్డ్ లీవ్ సహా ఎలాంటి సాధారణ సెలవులు మంజూరు చేయరు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత ఉన్నతాధికారుల అనుమతితో సెలవులు ఇవ్వనున్నారు. అలాగే అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)లు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

ఇక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పోలీసు కమిషనర్ ప్రత్యేక అనుమతి లేకుండా ఎలాంటి శిక్షణా కార్యక్రమాలకు హాజరుకావద్దని కూడా ఆదేశించారు. విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో జనసమూహ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News