E-PAPER

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా మణుగూరులో భారీ రాస్తారోకో

మణుగూరు, జూలై 22 (వై7 తెలుగు న్యూస్): లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ అరెస్టులను ఖండిస్తూ మణుగూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏఐసీసీ ఆదేశాలు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచనలతో చేపట్టబడింది.

మణుగూరు అంబేద్కర్ సెంటర్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినాకి నవీన్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూరం రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష, ధర్నాకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజలు సహించరని, రాజకీయ కక్షసాధింపు చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సూరపురెడ్డి తరుణ్ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శి ఆరిఫ్ పాషా, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి రహీం భాషా, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు పొడుతూరి రవి, సర్పంచులు కలబోయిన మాధవరావు, పూనెం రమేష్, మడకం రామకృష్ణ, జగిడి ప్రసాద్, పాల్వంచ రాములు, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, కొమరం మహేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!