వై 7 న్యూస్ పలాస;
పలాస మండలం శాసనం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రహదారి దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన జింకను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
జనవాస ప్రాంతంలోకి వచ్చిన అమాయక జంతువు ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికులను, జంతు ప్రియులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై బాధ్యత గల అధికారుల నుంచి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Post Views: 16









