E-PAPER

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత దుప్పట్ల పంపిణీ

కమలాపురం:
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రుత్తల స్వామి చంద్ర, విశ్వప్రియ సిద్ధార్థనన్ & కేశిరెడ్డి శైలు గార్ల సహకారంతో కమలాపురంలోని ఎస్సీ కాలనీ, ఒడిస్సా కాలనీ, గుంపనిగూడెం ప్రాంతాల్లో పలువురు వృద్ధులు, ఆధారంలేని అభాగ్యులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు.
చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధులు, నిరాశ్రయుల ఆరోగ్యాన్ని కాపాడడమే తమ ముఖ్య లక్ష్యమని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మునిగాలా రాకేష్, గౌరవ సలహాదారులు కోలగట్ల నరేష్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు మునిగాలా వెంకటేశ్వర్లు, సదానందం, ఇప్పల నరేష్, లక్ష్మణ్, నరేష్, అశోక్, సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News