E-PAPER

వాహన తనిఖీల్లో పట్టుబడిన 5 లక్షల రూపాయలు సీజ్

-తూప్రాన్ సీఐ రంగకృష్ణ

మెదక్ జిల్లా మనోహరాబాద్ న్యూస్ డిసెంబర్ 01

ఎన్నికల ఆచరణ నియమావళి అమలు నేపథ్యంలో తూప్రాన్ సీఐ రంగకృష్ణ మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ మరియు ఐడి పార్టీ సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల సమయంలో మనోహరాబాద్ పీఎస్ పరిధిలోని కాల్లకల్ గ్రామం వద్ద అనుమానాస్పదంగా బైక్ మీద ప్రయాణిస్తున్న కుచారం గ్రామ నివాసి మనోజ్ కుమార్‌ను తనిఖీ చేయగా అతని వద్ద చట్టబద్ధ ఆధారాలు లేని రూ.5,00,000/- నగదు ఉన్నట్లు గుర్తించి అక్కడే పంచనామా ప్రక్రియను విధివిధానాల ప్రకారం పూర్తి చేసి,స్వాధీనం చేసిన నగదును సీజ్ మెమోతో పాటు సంబంధిత రికార్డుల్లో నమోదు చేసినట్లు సీఐ ఎస్ఐ లు తెలిపారు.అనంతరం స్వాధీనం చేసిన మొత్తాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం తూప్రాన్ ఆర్డీవోకు అధికారికంగా అప్పగించబడిందని తెలిపారు.ఎన్నికల నియమావళి అమలులో భాగంగా,అక్రమ రవాణా,అనధికార నగదు ప్రవాహం మరియు ఇతర ఉల్లంఘనలను నిరోధించేందుకు ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని సీఐ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News