E-PAPER

పలాస మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించండి – యూనియన్ వినతిపత్రం సమర్పణ

వై 7 న్యూస్ పలాస | పలాస

పలాస మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ జి. కనకరాజుకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

కార్మికుల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ, వారు వినతిపత్రంలో పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. కనీస వేతనాలు అమలు చేయాలని, 2023 సమ్మె కాలానికి సంబంధించిన వప్పందాలపై జీ.ఓలు విడుదల చేయాలని, 2011–12 సంవత్సరాల పీఎఫ్ నిధులను కార్మికుల ఖాతాలలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా, సిబ్బందిని పెంచి పని భారం తగ్గించాలని, మరణించిన లేదా రిటైరైన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి యన్. గణపతి, యూనియన్ నాయకులు సి.హెచ్. మురగన్, వై. రవి, ప్రకాష్ ముఖి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News