వాట్సాప్ గవర్నన్స్ కు ఎమ్మెల్యే గౌతు శిరీష శ్రీకారం
పలాస :
ప్రజా సమస్యల పరిష్కారం మరింత వేగవంతం చేసేందుకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతివారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కు హాజరుకాలేని వారికి తీయని వార్త అందించారు. వాట్సాప్ గవర్నన్స్ తీసుకువచ్చారు. ఏ సమస్య ఉన్నా వాట్సాప్ లో సమాచారం అందిస్తే పరిష్కారం చూపనున్నారు. మన గౌతు శిరీష ఎమ్మెల్యే పలాస పేరిట ఉన్న 97524 85999 నంబర్ కు సమస్యలు పంపించవచ్చని ఎమ్మెల్యే శిరీష స్పష్టం చేశారు. ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు కార్యాలయానికి రాలేని పరిస్థితులున్న నేపథ్యంలో వారికి ఈ వాట్సాప్ గవర్నన్స్ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Post Views: 43









