మెదక్ స్టాపర్ నవంబర్ 21
58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మేదక్ జిల్లాలో గురువారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలను వైభవంగా నిర్వహించామని తెలిపారు.
గ్రంథాలయ వారోత్సవాల చివరి రోజు కార్యక్రమానికి డీఈఓజయలక్ష్మీ, డీఎస్ఓ రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారోత్సవాల భాగంగా గత వారం రోజులుగా లైబ్రరీలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో లైబ్రేరియన్ నరేందర్ రెడ్డి, యాదగిరి, శంకర్, మురళి, నాని, ఉమా, మమతతో పాటు పాఠకులు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 32









