మెదక్ జిల్లా న్యూస్ నవంబర్ 21:-
నూతనంగా జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆల్ర విజయ శుక్రవారం తూప్రాన్ లో జరుగుతున్న కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశంలో ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ గురించి అలాగే ఎఫ్ఎల్ఎస్ గురించి వివరించారు.ప్రతి విద్యార్థికి కనీస సామర్ధ్యాల గురించి అవగాహన చేయాలని ప్రతి విద్యార్థి చదువులో ముందుండాలని విద్యార్థి పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని జనవరిలో జరిగే ఎఫ్ఎల్ఎస్ గురించి విద్యార్థులకు అవగాహన కలిగించాలని సూచించారు.జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో జరిగే పదవతరగతి విద్యార్థులకు జరిగే ప్రత్యేక తరగతులను పరిశీలించారు.పదవతరగతి విద్యార్థులకు చదువు పట్ల శుద్ధ వహించాలని ప్రతిరోజు పాఠశాలకు రావాలని మార్చిలో జరగబోయే పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని సూచించారు.నూతన డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన విజయను ప్రిన్సిపాల్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డాక్టర్ పార్వతి సత్యనారాయణ మండల ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ పట్లురి లక్ష్మణ్ అలాగే ఉపాధ్యాయులు జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.









