వై 7 న్యూస్ పలాస
పలాస హడ్కో కాలనీ లో శుక్రవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్ అకస్మాత్తుగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ప్రాణనష్టం ఏదీ జరగలేదని కాలనీ వాసులు తెలిపారు. అయితే, సుమారు ₹2 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నారు.
Post Views: 48









