మెదక్ జిల్లా ట్రాన్స్‌కో కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడి చేసి, డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) మహమ్మద్ షరీఫ్ ఖాన్‌ను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సంగారెడ్డి ఏసీబీ అధికారుల సమాచారం మేరకు ఈ దాడి జరిగింది. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తి కొత్త పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకొని, దానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వమని డీఈని సంప్రదించాడు.
ఈ సందర్భంలో షరీఫ్ ఖాన్ రూ.40 వేల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇరువురి మధ్య చర్చల అనంతరం రూ.30 వేలకే ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రూ.9 వేల రూపాయలు ముందుగా చెల్లించగా, గురువారం మిగతా రూ.21 వేల రూపాయలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు డీఈను పట్టుకున్నారు.
Post Views: 110









