బాన్సువాడ ఆగస్టు 16 వై సెవెన్ న్యూస్
రుద్రూర్ మండలం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టీఎస్ ఐ సి సి సి సమాచారం ప్రకారం, రాబోయే 3 గంటల్లో నిజామాబాద్ మీదుగా కొన్ని ప్రాంతాలలో ఉపరితల గాలులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలపడంతో రుద్రూర్ మండల అధికారులు తహసీల్దార్ తరబాయి, ఎంపీడీవో భీంరావు,ఎస్సై సాయన్న రుద్రూర్ మండలంలోని బోపాప్పూర్, అంబేమ్, సులేమాన్ ఫారం,పాటు పలు గ్రామాలను సందర్శించిన్న మండల అధికారులు గ్రామ అధికారులను అప్రమత్తం చేశారు గ్రామాల్లోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు. రుద్రూర్ ప్రజలు ఎవరు కూడా వాగులు కాలువలు చెచెరువుల్లోకి చేపలు పట్టేందుకు వెళ్లనీయవద్దని. ఎవరివైనా పాత ఇల్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి మండల అధికారులకు సమాచారం ఇవ్వవాలని 8712659876, 7382609767 పునరావాస కేంద్రంలో ఉండగలరని కోరారు. విద్యుత్ తీగలు ఎక్కడైనా తెగి ఉంటే వెంటనే విద్యుత్అధికారులకు తెలియజేయాలన్నారు. రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.









