E-PAPER

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మణుగూరు, ఆగస్టు 15 (వై 7 న్యూస్):
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ ఉన్నత పాఠశాల, శివలింగాపురంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని స్కూల్ హెడ్ మాస్టర్ కె. ఉపేందర్, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం దుర్గాదేవి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ప్రపంచంలో డ్రగ్స్ ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతున్నాయని, గ్రామాలు, పాఠశాల స్థాయికి కూడా ఈ ప్రమాదం చేరిందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అలాగే బాల్య వివాహాలు మరియు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ కె. ఉపేందర్, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం దుర్గాదేవి, ఉపాధ్యాయులు ఎం. భారతి, జి. సావిత్రి, బి. విజయలక్ష్మి, బి. రాము, ఐ సి డి ఎస్ టీచర్ సుమలత,కమ్యూనిటీ సోషల్ మొబలైజర్ నాగుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News