మెదక్ వై 7 న్యూస్ ఆగస్టు 11
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటరత్నాపురం గ్రామంలోని యాదవ సంఘం సంబంధించిన దేవాలయ భూమి ఇతరుల పేరున ఉన్నదని వెంటనే తమ సంఘంపై మార్పు చేయాలని ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ దేవాలయానికి సంబంధించిన భూమి ఇతరుల పైన ఉన్నందున అట్టి వ్యక్తులు ఇతరులకు విక్రమించే అవకాశం ఉన్నందున వెంటనే తమ దేవాలయానికి సంబంధించిన భూమిని తమ సంఘంపై మార్పు చేసి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈ సత్తయ్య , ఎస్ ఆంజనేయులు , బి మల్లేశం , యస్ మల్లేశం , బి నాగరాజు , బి యాదగిరి , ఎస్ వెంకటేష్ , ఎస్ శ్రీశైలం , ఎస్ స్వామి , ఎస్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 53









