E-PAPER

మాకు న్యాయం చేయండి ; భూమిపుత్ర సొసైటీ సభ్యులు

చర్ల ఆగస్ట్ 07 వై 7 న్యూస్;

గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చిన వార్తా కథనాలను తప్పుడు కథనాలని అనడం దుర్మార్గమని చర్ల మండలం మొగళ్ళపల్లి గ్రామానికి చెందిన భూమిపుత్ర గిరిజన మహిళా సొసైటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతనే సొసైటీకి సంబంధించిన పుస్తకాలను రేజింగ్ కాంట్రాక్టర్ కమిటీ సభ్యులకు ఇచ్చారని వారన్నారు.ఇసుక రీచ్ మంజూరు అవడానికి రేజింగ్ కాంట్రాక్టర్ కోట్లు ఖర్చు పెట్టారని అందువల్లనే పుస్తకాలు ఆయన దగ్గర ఉంచాడని సొసైటీ అధ్యక్షురాలు తమతో గొడవ పడడం నిజం కాదా,ఆ. గొడవ పోలీస్ స్టేషన్ వరకూ చేరడం నిజం కాదా అని వారు ప్రశ్నించారు.గ్రామ పంచాయితీ కార్యాలయంలో జరగవలసిన విచారణ రేజింగ్ కాంట్రాక్టర్ ఇంటి వద్ద జరగిన విషయం అబద్దమా, అధికారులు కూడా రేజింగ్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కై తమను అన్యాయం చేస్తూ తమకు అనుకూలంగా ఉన్న పత్రికలలో అన్యాయం చేస్తున్న వ్యక్తిని అందరి వాడు అని డబ్బులిచ్చి కథనాలు రాయించుకున్నారని మండిపడ్డారు.అక్రమాలు చేసే వ్యక్తులను ఆహా ఓహో అంటూ రాసే వారు గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని తమ పత్రికల్లో ఎందుకు రాయరని ప్రశ్నించారు.
ప్రభుత్వ అధికారులు సైతం పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు భూమిపుత్ర సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని జిల్లా కలెక్టర్ భద్రాచలం ఐటిడిఏ పిఓ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ మరియు పాత్రికేయులందరి సమక్షంలో బహిరంగ విచారణకు మేము సిద్ధం అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు . చర్ల మండలంతో పాటు భద్రాచలం డివిజన్ లో ఉన్న పాత్రికేయులందరూ మొగళ్ళపల్లి వచ్చి వివరాలు తెలుసుకొని తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గత పరచాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News