పినపాక, జూన్ 20: వై 7 న్యూస్;
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఈ బయ్యారం మండలం పరిధిలోని విప్పల గుంపు సుందరయ్య నగర్, వలస ఆదివాసి గ్రామాలను శుక్రవారం స్థానిక పోలీసు అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, గ్రామంలోని పిల్లలకు నోట్ బుక్స్, పలకలు వంటి విద్యాసాధనాలను పంపిణీ చేశారు. గ్రామస్థులతో మాట్లాడిన అధికారులు, అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని సూచించారు.
విద్య ద్వారానే యువత ఉన్నత స్థానాలకు చేరుకోగలరని, సామాజికంగా ముందుకు సాగాలని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అసాంఘిక శక్తులకు తోడ్పాటు ఇవ్వకుండా చట్టానికి అనుగుణంగా జీవించాలన్నారు. పోలీసులు గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడినట్టు పేర్కొన్నారు.
Post Views: 21