కరకగూడెం, జూన్ 19 వై 7 న్యూస్;
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలోని నిమ్మలగూడెం నీలాద్రిపేట వలస ఆదివాసి గ్రామంలో నేడు పోలీసులు కమ్యూనిటీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు వాలీబాల్ కిట్లు, చిన్నారులకు పలకలు పంపిణీ చేశారు.
పోలీసు అధికారులు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసం కలిగి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. మావోయిస్టులు కాలం చలిన సిద్ధాంతాలతో సమాజాన్ని వెనక్కి లాక్కెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
విద్య ద్వారా యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలనుండి దూరంగా ఉండాలని అలాంటి చర్యలు కేసులు, శిక్షలకు దారితీస్తాయని హెచ్చరించారు. సామాజిక శక్తులకు సహకరిస్తూ శాంతియుత మార్గంలో అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏడూర్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు, స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.