తూప్రాన్ మే24 వైసేవన్ న్యూస్
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మెదక్ జిల్లా అధికారి డిపిఓ జిశ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం డి టి ఎఫ్ మెదక్ సీఐ గోపాల్ తమ సిబ్బందితో శనివారం తూప్రాన్ పట్టణంలో గంజాయి విక్రయాలు చేసే వ్యక్తుల పైన నిఘా ఏర్పాటు చేసి సోదాలు చేయడం జరిగింది, విశ్వసనీయ సమాచారం మేరకు తూప్రాన్ లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనికులు చేయుచుండగా అనుమానాస్పదంగా ఒక ద్విచక్రవాహనం పై వస్తున్న వ్యక్తిని ఆపి వాహనం తనికి చేయగా 41 (300గ్రా, లు)ప్యాకెట్లు ఎండు గంజాయి ఉన్నట్లు గమనించిన అధికారులు అట్టి వెక్తిని వాహనాన్ని అదుపులోకి తీసుకొని అతనిని విచారించగా అతని పేరు బుర్ర.జితేందర్ హైదరగూడ తూప్రాన్ పట్టణానికి చెందిన వాడుగా తెలిపినాడు అధిక లాభాలను ఆశించి గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు అధికారులకు తెలిపినాడు తదుపరి అధికారులు ఇట్టి వ్యక్తి పైN.D.P.S ACt ప్రకారం కేసు చేయడం జరుగుతుందని తెలిపి మరియు తదుపరి విచారణ నిమిత్తం ఎస్ హెచ్ ఓ నర్సాపూర్ అప్పగించడం జరిగింది అని తెలిపి నారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ గోపాల్ మాట్లాడుతూ గంజాయి విక్రయాలు చేసినా రవాణా చేసిన మత్తుపదార్థాలు కలిగి ఉన్న వ్యక్తుల యొక్క సమాచారం తమకు ఇవ్వవలసిందిగా కోరారు.. అట్టి వ్యక్తుల యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచి గంజాయి రవాణా చేసే వ్యక్తుల పైన కేసులు నమోదు చేస్తామని తెలిపినారు..ఇట్టి దాడులలో ఎస్సై.బాలయ్య హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ ఎల్లయ్య చంద్రయ్యా,రాజు, రవి,నవీన్,నరేష్,హరీష్ లు పాల్గొన్నారు