వై సెవెన్ న్యూస్ బాన్సువాడ
పొతంగల్ మండల కేంద్రంలో తాసిల్దార్లేక ఇబ్బందులు ఎదుర్కొంటు జనం తమ గోడు మీడియాకు విన్నవిస్తున్నారు. పొతంగల్ మండల కేంద్రంలో తాసిల్దార్ గా పనిచేసిన మల్లేష్, ఏ విషయంపై ఇకనుంచి బదిలీ అయ్యారో తెలవదని, ఏది ఏమైనా అంతర్గతంగా కొన్ని విషయాల్లో దళిత ఎమ్మార్వో కావడం వల్లనే అతనికి ఇక్కడి నుంచి బదిలీ చేశారనేది ప్రధాన రూమర్స్, మల్లేష్ ఎమ్మార్వో పనిచేసినప్పుడు పోతంగల్ మండల కేంద్రంలో మంచి సేవలు అందించడం జరిగిందని ప్రజల నోట ఉండే మంచి ఎమ్మార్వో ను హఠాత్తుగా ఇక్కడి నుంచి ఎందుకు బదిలీ చేశారు అర్థం కావడం లేదని జనం తల్లోడిని పోతున్నారు ఆ కారణం ఇప్పటికీ తెలవదని పలువురు చర్చించుకోవడం విశేషం. ఎమ్మార్వో మల్లేష్ పోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎమ్మార్వో లేరని కోటగిరి ఎమ్మార్వో గంగాధర్ ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారని పలువురు చర్చలు చేస్తున్నారు. గంగాధర్ మంచి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నప్పటికీ అదనపు బాధ్యత లు నిర్వర్తిస్తున్నప్పటికీ, అత్యంత రిస్కుతో పనిచేస్తున్నారని, పొతంగల్ మండల కేంద్రంలో తాసిల్దార్ పని చేయాలంటే కత్తి మీద సామూలాంటిదని, ఎన్ని అవంతరాలు ఎదురైనా మల్లేష్ గతంలో ఏ విధంగా అయితే బాధ్యతలు చేపట్టారు గంగాధర్ కూడా అలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ మంచి సేవలు ప్రజలకు అందిస్తున్నారని ప్రజలు చెప్తున్నారు, ఇన్చార్జి బాధ్యత వల్ల , ఎప్పుడైనా మీటింగ్లు ఉంటే జిల్లా స్థాయి మీటింగ్ ఉంటే ప్రజలకు సేవలు అందలేకపోతున్నాయని ఈ విషయంలోనైనా ఇప్పటికైనా తాసిల్దార్ తో పాటు డిటి నియామకం చేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.