ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తమ పోరాటం ఆగదు
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి
సూర్యాపేట, మే 13 (వై సెవెన్ న్యూస్)
రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ కల్పించేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై చావో రేవో అనే రీతిలో పోరాటాలను ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు సోమవారం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన నిర్వహించిన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల తర్వాత మరోలా ప్రవర్తిస్తూ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉండి దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు తెలంగాణ వికలాంగుల సమాజాన్ని ఎంతో ఆవేదనకు గురిచేస్తుందని ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే తెలంగాణలో వికలాంగుల పింఛన్లను 6000కు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యంగా రాజస్థాన్ చతిస్గడ్ తరహాలో తెలంగాణలోనూ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రా చిట్టి చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయ అస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నాటి పీసీసీ అధ్యక్షుడు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేచ్చేందుకు ఎందుకు ఎనకడుగు వేస్తున్నారో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహించేందుకు ముందుకు వెళ్లాలని పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ తేల్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళితే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడమే లక్ష్యంగా తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తమ పోరాటాలను ఉధృతం చేస్తుందని తెలిపారు. సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు అధ్యక్షత నిర్వహించిన ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో సంఘం నాయకులు వీరమ్మ బిక్షం ఉప్పునూతల నరసయ్య మట్టపల్లి పూలమ్మ ఆరూరి బాబు నరేష్ రెడ్డి కొండ సైదులు యాదవ్ మున్న మధు యాదవ్ పేర్ల సోమయ్య యాదవ్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు









