మణుగూరు, మే 12, వై సెవెన్ న్యూస్;
మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో సోమవారం నిర్వహించిన నేషనల్ అప్రెంటిస్ మేళా విజయవంతమైనట్లు ఐటిఐ ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి రవి తెలిపారు. అయితే పూర్తి చేసిన విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అప్రెంటిస్ జాబ్ మేళాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన రాణి ఇంజన్ వాల్స్, ఫెనేనెస్ట్ బిల్డింగ్ సిస్టమ్స్, వి ఎల్ ఆర్ ఫెసిలిటేటర్స్, తదితర కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఆయా కంపెనీల ఉద్యోగ వివరాలకు సంబంధించిన విషయాలను వివరించారు. ఈ అప్రెంటిస్ జాబ్ మేళాకు 115మంది హాజరు కాగా 45మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సాగర్ ఐటిఐ ప్రిన్సిపాల్ ధర్మచారి, ఎన్ ఎస్ డి సి విశ్వకర్మ జిల్లా కోఆర్డినేటర్ పల్లవి, మణుగూరు ప్రభుత్వ ఐటిఐ సూపరిండెంట్ టీ ఎన్ జ్యోతిరాణి, ఏటీవోలు జీవి కృష్ణారావు అంకం నరసయ్య, మయ్యా శ్రీనివాసరావు, వేణుగోపాల్ నాయుడు, కంపెనీల ప్రతినిధులు ధర్మ, నవీన్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









