E-PAPER

అశ్వాపురం భారజల కేంద్రం నందు పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్

అశ్వాపురం వై7 న్యూస్

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అశ్వాపురం నందు గల హెవీ వాటర్ ప్లాంట్ నందు మాకు డ్రిల్ ను నిర్వహించడం జరిగింది.నిన్న అనగా 10.05.2025 శనివారం నాడు హెవీ వాటర్ ప్లాంట్ నందు ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించడం జరిగింది.ఏదైనా అత్యవసర సమయంలో మరియు ఆకస్మిక దాడి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సందర్భానుసారంగా రక్షణ కొరకు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి తెలియపరుస్తూ ఈ మాక్ డ్రిల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని డిఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు.భారజల కేంద్రంలో ఉద్యోగులు పనిచేసే చోట మరియు కాలనీలో నివసించే వారి కుటుంబాలు అత్యవసర సమయంలో అలారం సిస్టంను వినియోగించినప్పుడు పాటించవలసిన నియమ నిబంధనల గురించి వివరించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ కమాండెంట్ అమిత్ కుమార్, ఎస్డిపిఓ మణుగూరు రవీంద్ర రెడ్డి, అశ్వాపురం సిఐ జి అశోక్, ఎస్ఐ మధు ప్రసాద్ మరియు సిఐఎస్ఎఫ్ సిబ్బంది అశ్వాపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News