రుద్రంపూర్, మే 8:
భూగర్భ జలాల పరిరక్షణకు భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి శాఖ వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రీజినల్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ, “ఇంకుడు గుంతలు భవిష్యత్ తరాలకు నీటి వనరుల రక్షణకు శ్రీరామరక్షలా పనిచేస్తాయి” అన్నారు.
ఎస్‌బిఐ రుద్రంపూర్ బ్రాంచ్‌లో నిర్వహించిన ఇంకుడు గుంత తవ్వే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఈశ్వర్ రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, హెచ్.ఆర్. మేనేజర్ రాములు తదితర బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 56









