బూర్గంపాడు
మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బూర్గంపాడు మండలం చెరువు సింగారం ప్రాంతంలో ఉపాధి పని చేస్తున్న ఉపాధి కార్మికుల్ని సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు. వారితో మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం ప్రజల పైన భారాలు మోపుతూ ప్రజలకున్న హక్కులని ప్రైవేటు వ్యక్తులకి అప్ప జెప్పడం, ప్రభుత్వం ఆస్తులని కొందరికి అప్పనంగా ఇవ్వటం, సామాన్య ప్రజల పైన నిత్యవసర సరుకులు కొనలేని పరిస్థితి,ఉపాధి కార్మికులకు కొలతలు లేకుండా డబ్బులు ఇవ్వాలని, 600 రూ/- రోజు కూలి ఇవ్వాలని రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉపాధి కార్మికుల పైన ఉందని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని దుర్వినియోగం చేయాలని, నిధులు బడ్జెట్లో కేటాయించలేదని పని భారాన్ని పెంచటం మూడు ఫోటోలు పేరుతో ఉపాధి కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం, అనేక విషయాలు పైన సార్వత్రిక సమ్మె మే 20న జరిగే సమ్మెకు ఉపాధి కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని నినాదాలు ఇస్తూ ఉపాధి హక్కుని కార్మిక చట్టాలనే కాపాడుకుందామని నాలుగు లేబర్ కోడ్ల్ రద్దు చేయాలని కార్మిక చట్టాలని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో కుర్స సత్యనారాయణ, కనితి శంకర్, భీమయ్య, జోగారావు, ఇర్ప సీతమ్మ ,మహేశ్వరి, మేకల నారాయణ, గణేష్,కనితి కృష్ణమూర్తి,కారం అర్జున్ రావు, కారం సీతమ్మ, మిరియాల చిట్టిమ్మ, తదితరులు పాల్గొన్నారు.









