E-PAPER

గ్రామాలకు తరలండి .పి.డి.ఎస్.యు

మణుగూరు,మే 08 వై 7 న్యూస్ తెలుగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం లోనీ కొండాపురం, రేగుల గండి,తొగ్గూడెం గ్రామాలను పి.డి.ఎస్.యు రాష్ట్ర కమిటీ బృందం సందర్శించి ఆయా గ్రామాలలో పల్లెలే మా పాఠశాలలు ప్రజలే మా గురువులు అనే నినాదంతో మే 6 నుండి 13 వరకు పి.డి.ఎస్.యు రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా గ్రామాలకు తర్లండి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సమస్యలను సర్వే రూపంలో తెలుసుకోవడం జరిగిందని పి.డి.ఎస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, అజయ్, ప్రణయ్ తెలిపారు. వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ఆదివాసి గ్రామాలు నేటికీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కనీస వసతులు ఐన నీరు, రోడ్డు, కరెంట్ కూడ ఆ ప్రాంత ప్రజలకు అందడం లేదు. వలస ఆదివాసుల పేరుతో గొత్తి కోయ ప్రజలను అబివృద్దికి దురం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ఓట్లతో 6 గ్యారెంటీ,420 హామీలతో రాష్ట్రం లొ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలను మోసగించింది. పేరుకే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి మహిళల మధ్య తారతమ్య బావన్ని సృష్టించారు.ఇందిరమ్మ ఇండ్ల క్రింద పైలెట్ ప్రాజెక్ట్ పేరుతో కొన్ని గ్రామాలకు మాత్రమే నామా మాత్రం గా ఇండ్లను ప్రకటించి మిగత గ్రామాలను గాలికి వదిలేశారు.విద్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి,విద్యకు పెద్ద పీఠం వేస్తానన్న రేవంత్ ప్రభుత్వం నేటికి రీయంబర్మెంట్స్ విడుదల చెయ్యలేదు. స్కాలర్ షిప్స్,రియంబర్మెంట్స్ లేక గ్రామిన ప్రాంత విధ్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు .
కేంద్రం లోని భ.జ.పా మెడీ సర్కార్ హిందుత్వ, బ్రాహ్మణీయ, మతోన్మాద, ఫాసిజన్ని దేశం లో అమలు చేస్తూ, ప్రజల మధ్య కులం, మతం పేరుతో వ్యత్యాసాలు సృష్టిస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా దండకారణ్యం ప్రాంతంలో ఆదివాసి హక్కులను ఖననం చేస్తుంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర పార మిలిటరీ బలగాలు ఆదివాసులపై వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి.ఇందులో దాగి ఉన్న సూత్రం ముఖ్యంగా ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలోని దండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే.
తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజల సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వాలు పాటుపడాలని ఈ సందర్భంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు మహేష్,కొత్తగూడెం జిల్లా నాయకులు రాగిణి, అరుణ, కిరణ్, గాంధీ, భాను తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!