E-PAPER

రిపోర్టర్ గడ్డం ప్రశాంత్ కుమార్ ను పరామర్శించిన జర్నలిస్ట్ యూనియన్ నేతలు

తూప్రాన్, మార్చి, 29. వై సెవెన్ న్యూస్

తూప్రాన్ పట్టణానికి చెందిన రిపోర్టర్ గడ్డం ప్రశాంత్ కుమార్ ఇటీవల హనుమాన్ మాల వేసుకున్న రోజే భోజనం చేస్తూ ఫిట్స్ వచ్చి వెనుకకు పడిపోవడం తో రెండు కాలర్ బోన్స్ విరిగిపోయి స్పృహ కోల్పోగా హుటాహుటిన 108 అంబులెన్స్ వాహనంలో మొదటగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్యుల సలహా మేరకు కొంపల్లి లోని సాయి సిద్ధార్థ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించి నాణ్యమైన చికిత్స అందించారు. రెండు కాలర్ బోన్స్ కి శస్త్రచికిత్స సర్జరీ చేశారు. కాగా శుక్రవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుడ్డ భాగ్యరాజు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ సి.ఆర్, సీనియర్ జర్నలిస్ట్ లు ఆర్.శివ శంకర్ గౌడ్, గైనిబైటి భాస్కర్ గౌడ్, ఎన్.వెంకటేష్ లు పరమార్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సాయి సిద్ధార్థ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడారు. గడ్డం ప్రశాంత్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో తూప్రాన్ మున్సిపల్ మూడవ వార్డు కౌన్సిలర్ బైరం సత్య లింగం, కోర బోయిన ప్రవీణ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :