అనారోగ్యంతో మృతి చెందిన సింగరేణి కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
మణుగూరు,డిసెంబర్15 వై 7 న్యూస్ తెలుగు;
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి-2 ఏ రిలే ఆపరేటర్ల ఆధ్వర్యంలో తమ షిఫ్ట్ లోనే పంపు ఆపరేటర్ గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన పీ వి కాలనీ వాసి రుద్రాక్షల కృష్ణ కుటుంబానికి ఆదివారం నాడు పీవీ కాలనీలో వారి నివాస గృహానికి చేరుకుని ఏ రిలే షిఫ్ట్ ఇన్ చార్జ్ ఎం నరసింహారావు చేతుల మీదుగా డబ్బయి మూడు వేల ఐదువందల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ ఆపదలో ఉన్న తమ తోటి ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా ఆపన్న హస్తం అందజేసి మేమున్నామంటూ కొండంత మనోధైర్యాన్ని నింపటం ఓదార్పునివ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆపరేటర్ల సేవలను ఆయన కొనియాడారు. తమ తోటి ఉద్యోగులే కాకుండా కష్టాల్లో ఉన్న అనేకమందికి అనేక విధాలుగా పలు సందర్భాలలో తోడ్పాటునందించిన ఏ రిలే ఉద్యోగులను ఆయన ప్రశంసించారు. అందరితో ఎంతో స్నేహభావంగా ఉండే కృష్ణ మృతి ఎంతో బాధాకరమని సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అండర్ మేనేజర్ భార్గవ్,ఇంజనీర్ వెంకటరమణ హెడ్ ఓవర్ మెన్ లు సుదీప్, రాజ్ కుమార్, ఏ రిలే ఆపరేటర్ల తరపున ప్రతినిధులుగా సయ్యద్ నయమత్ హుస్సేన్, కె మల్లికార్జునరావు, భాగం రవికుమార్, గిరీష్ రెడ్డి, శ్రీధర్, చెన్నుపాటి హనుమాన్ బాబు,కొత్త సత్యనారాయణ, ఎండి యాకూబ్ పాషా, అన్నం రాజేందర్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.