మీరు చేస్తే సంసారం…మేము చేస్తే వ్యభిచారమా…
నీకు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ని విమర్శించే అర్హత నీకు లేదు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం.
పినపాక,డిసెంబర్ 08 వై 7న్యూస్
కాంగ్రెస్ పార్టీ మోసాల పార్టీ రేగా కాంతారావు గారు 12 మాసాలు అంటున్నారు. రేగ కాంతారావు మీరు చెప్పిన విద్య కదా 2018లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను గెలిపిస్తే మీరు మోసం చేసి బిఆర్ఎస్ పార్టీకి జంప్ అయింది మీరు చేసింది సంసారం మేం చేసింది వ్యభిచారమా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే తిరిగి మీ ముఖం మీదనే నాలుగు వేలు చూస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్ర పాలకుల మాటలు నమ్మి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేసింది మీరు కాదా కాంగ్రెస్ పార్టీని మోసం చేసినందుకు 2023లో మిమ్ములను ఓడించడం జరిగింది. ఈ రోజున మా ఎమ్మెల్యే పాయం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు. పాయం అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ 2023 సంవత్సరంలో 35 వేల మెజారిటీ సాధించడం జరిగింది. నేను సవాల్ చేస్తున్న వచ్చే 2029 ఎలక్షన్ లో మా ఎమ్మెల్యే పాయంని 70000 మెజారిటీతో గెలిపించడం జరుగుతుంది. పినపాక నియోజకవర్గం గడ్డ కాంగ్రెస్ అడ్డా గుర్తుంచుకోండి.ఈ కార్యక్రమంలో
మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె మదర్ సాహెబ్, ఎక్స్ సర్పంచ్ గొగ్గల్ నాగేశ్వరరావు, తోలం అర్జున్, మాడె రామనాథం, మాడే పాపారావు, ఎట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.