మణుగూరు, నవంబర్ 20 వై 7 న్యూస్
సింగరేణి కాలరీస్ WPS & GA అధ్వర్యంలో మణుగూరు ఏరియా పివి కాలనీ భద్రాద్రి స్టేడియం నందు ఈ నెల 19,20 తేదీలలో నిర్వహించబడిన కంపెనీ స్థాయి కంపెనీ లెవెల్ హాకి టోర్నమెంట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి.
ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సింగరేణిలోని అన్నీ ఏరియాల నుండి విచ్చేసిన సింగరేణి ఉద్యోగ క్రీడాకారులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ, జీవితంలో ప్రతి నిమిషం విలువైనది డ్యూటి అయ్యాక మిగిలిన సమయం వృధా కాకుండా, వేరే వ్యాపకాల వైపు దృష్టి మర్లకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి రోజూ యోగా, ధ్యానం, క్రీడల కొరకు కొంత సమయం కేటాయించటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయేస్కరం. ముఖ్యంగా సింగరేణి ఉధ్యోగులు శ్రమతో కూడిన విధులు నిర్వర్తిస్తారు కాబట్టి దేహ దారుఢ్యనికి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటానికి క్రీడలు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి కాబట్టి సింగరేణి ఉద్యోగ క్రీడకారులందరూ ఆటలను దినచర్యలో భాగం చేసుకొని క్రీడా నైపుణ్యతతో రాణిస్తూ కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి విజయ పతాక ఎగురవేయాలని క్రీడాకారులకు శుబాభినందనలు తెలియజేస్తూ, వివిధ ఏరియాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన సింగరేణి ఉద్యోగ క్రీడాకారులకు ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసి కంపెనీ స్థాయి క్రీడాపోటీలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మణుగూరు ఏరియా కార్య నిర్వాహణ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
సుహృద్భావ వాతావరణంలో ఎంతో ఉత్సాహ భరితంగా కొనసాగిన ఈ క్రీడా పోటీలలో విజేతగా నిలిచిన జట్లకు, వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన చూపిన క్రీడాకారులకు జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్ గారు, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ వై రాంగోపాల్ , ఐఎన్‌టియూసి వైస్ ప్రెసిడెంట్ వి కృష్ణం రాజు , SO to GM & WPS&GA ఉపాదక్ష్యులు డి. శ్యామ్ సుందర్ , డిజిఎం(పర్సనల్) & WPS& GA చీఫ్ కొ ఆర్డినేటర్ ఎస్ రమేశ్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయబడింది.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి డివై.పిఎం పిబి అవినాష్ , గుర్తింపు సంఘం ఏఐటిియూసి బ్రాంచ్ సెక్రటరీ వై రాంగోపాల్ , ఐఎన్‌టియూసి వైస్ ప్రెసిడెంట్ వి. కృష్ణం రాజు , స్పొర్ట్స్ సూపర్ వైజర్ కార్పొరేట్ పాసినేట్, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ,అస్సిస్టెంట్ స్పొర్ట్స్ సూపర్ వైజర్ జాన్ వెస్లీ, అశోక్, శ్రీనివాస్, రమేశ్, కొ ఆర్డినేటర్ఆర్ శ్రీనివాస్, న్యాయ నిర్ణేతలు(హైదరాబాద్) కామేశ్వర రావు బృందం, ఉద్యోగ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.