E-PAPER

ఐదు టిప్పర్లు జెసిబి సిజ్ చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

ప్రభుత్వం అనుమతి లేకుండా మొరం తవ్వకాలు

సోమేశ్వరం గుట్ట నుంచి వెంచర్ కు తరలింపు సీరియస్ గా తీసుకున్న సబ్ కలెక్టర్

బాన్సువాడ నవంబర్ 19 వై 7న్యూస్ తెలుగు;

బాన్సువాడ మండలం లోని సోమేశ్వర్ గుట్ట వద్ద ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతుందని వచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే సబ్ కలెక్టర్ స్పందించి అక్రమంగా కొండ ను మొరం కోసం తవ్వుతున్న జెసిబి తో సహా 5 టిప్పర్లను స్వాదీనం చేసుకొని, చర్య కోసం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. బాన్సువాడ డివిజన్ లో ప్రభుత్వ అనుమతులు లేకుండా, కొంతమంది అధికారుల అండదండలతో అక్రమంగా ఇసుక దందా, మొరం దందా సాగడంతో దీనిపై సబ్ కలెక్టర్ సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే బిచ్కుంద, బీర్కూర్, మద్నూర్, డోంగ్లి, పొతంగల్, కరేగాం, సుంకిని, కొడిచర్ల, చెట్లూర్, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక దందా కొనసాగడంతో సబ్ కలెక్టర్ ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా ఇసుక దందా కొనసాగుతే చర్యలు తప్పవని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా సోమేశ్వర్ గుట్ట మొరం కోసం త్రవ్వకాలు జరుపుతుండగా జెసిబి తో సహా, 5 టిప్పర్లను సీజ్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వాల్టా చట్టం నియమ నిబంధనలను విస్మరిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్